తాగునీటి స‌మ‌స్య‌ను పరిష్కరించండి

పులివెందులః లింగాల మండ‌ల ప్ర‌జ‌ల తాగునీటి స‌మ‌స్య‌ను వెంట‌నే తీర్చాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పులివెందుల నియోజకవర్గ పర్యటనలో భాగంగా వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌​ పార్టీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌  లింగాల మండలంలోని అన్ని గ్రామాల ప్రజలతో విడివిడిగా సమావేశం అయ్యారు. సాగు, తాగునీటి సమస్యలపై ఆయన ప్రజలతో చర్చించారు. ప్రజలు వారి ఇబ్బందుల‌ను వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. చిత్రావతి జలాశయం నుంచి తగినంత నీటిని విడుదల చేయకపోవడంతో వారానికి ఒక్కసారి కూడా నీళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంట‌నే స్పందించిన వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌తో మాట్లాడారు. గ్రామాల్లో ప్ర‌జ‌ల‌కు నీటి స‌మ‌స్య త‌లెత్త‌కుండా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.


కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైయస్‌ వివేకానందరెడ్డిల సమక్షంలో వివిధ ప్రజాసమస్యలపై వైయస్ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రస్తుత ప్రభుత్వానికి తోలు మందమని.. సమస్యలను ఎత్తి చూపినా నిర్లక్ష్యం వహిస్తారే తప్ప.. పరిష్కారంపై చిత్తశుద్ధిలేదని జగన్‌ ఎద్దేవా చేశారు. ఎలాంటి సమ స్యలైనా అందరం కలిసికట్టుగా పోరాడి సాధించుకుం దామని పిలుపునిచ్చారు.  వేసవి మూడు నెలల పాటు ప్రజలు తాగునీటి సమస్యలు ఎదుర్కోకుండా ప్రభు త్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.

ఉచితమంటూ.. వందల బిల్లులా..
ప్రభుత్వం చెప్పేదొకటి.. ఆచరణలో చేసేది మరొకటిగా మారిందని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలు నివసిస్తున్న ప్రాంతాలకు సంబంధించి ఒక్కొక్క ఇంటికి 50యూనిట్ల వరకు విద్యుత్‌ ఉచితమని పేర్కొంటున్నా.. రూ.100, రూ.200, రూ.300లు ఇలా రూ.600ల వరకు బిల్లులు చెల్లించాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఎన్నో సమస్యలు తాండవిస్తున్నా చంద్రబాబు పట్టించుకోరు కానీ.. ప్రాజెక్టుల కాంట్రాక్టర్ల విషయంలో మాత్రం ప్రత్యేక జీవోలు విడుదల చేసి దోచిపెడుతున్నారని జగన్‌ విమర్శించారు. లింగాల మండలం తాగునీటి సమస్యపై అనంతపురం కలెక్టర్‌ కోనశశిధర్‌తో,చీనీ రైతుల సమస్యలపై వైయస్సార్‌ జిల్లా కలెక్టర్‌ కె.వి.సత్యనారాయణతో జగన్‌  మాట్లాడారు.


Back to Top