సాగునీటి సమస్యలను పరిష్కరించాలి

కపిలేశ్వరపురం:  మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న సాగునీటి సమస్యను పరిష్కరించాలని వైయస్‌ఆర్‌సీపీ మండల నాయకుడు పితాని శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని అంగరలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ  ప్రభుత్వం హంగు ఆర్భాటాలకు ప్రాధాన్యం ఇస్తుందని, రైతులకు సాగునీరు సక్రమంగా అందించేందుకు తగిన చర్యలు తీసుకోవడంలేదన్నారు. అంగర, పడమర ఖండ్రిక, తాతపూడి గ్రామాల ఆయకుట్టుకు సాగునీరు అందని పరిస్థితి ఉందని, వంతుల వారీ పద్దతిలో సాగునీరు అందిస్తామంటూ అధికారులు వ్యవసాయ క్షేత్రాల్లో బోర్డులు పెట్టారని అన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి సక్రమ నీటి పారుదలకు కృషి చేయాలని వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు అధికారులను డిమాండ్‌ చేశారు.

Back to Top