ప్రజాధనాన్ని వృథా చేస్తున్న ప్రభుత్వం

హైదరాబాద్ :

ప్రజా సమస్యలపై చర్చించాలన్న అభిప్రాయం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి విమర్శించారు. శాసనసభ నుంచి టిఆర్ఎ‌స్, ‌బిజెపి సభ్యులను స్పీకర్ సస్పెండ్‌ చేసిన అనంతరం అసెంబ్లీ సమావేశాల తీరుపై ఆమె మాట్లాడారు. ప్రజా సమస్యల గురించి ఏమాత్రం చర్చించకుండా ప్రజాధనాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం వృథా చేస్తోందని దుయ్యబట్టారు.

ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని వెంటాడి ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్షం టిడిపి మిన్నకుండిపోతోందని శోభా నాగిరెడ్డి ఆరోపించారు. శాసనసభ సమావేశాలు సజావుగా జరగకూడదన్న రీతిలో ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం వ్యవహరిస్తున్న తీరుపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరసన వ్యక్తం చేస్తున్నదని ఆమె చెప్పారు. ‌దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని శోభా నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు.

Back to Top