వైయస్ఆర్‌ కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు

హైదరాబాద్ :

ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌  తీసుకుంటున్నారు. తాజాగా గురువారంనాడు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్సీ పార్టీలో చేరారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన సాధారణ కార్యకర్తలు, నాయకులు కూడా పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి లోటస్‌పాండ్‌లోని తన క్యాంపు కార్యాలయంలో వారందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సన్నిహితుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు (ఎచ్చెర్ల) గురువారం‌నాడు వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నీలకంఠంను వెంట బెట్టుకుని వచ్చి‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేర్పించారు. విశాఖపట్టణం స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు కూడా పార్టీలో చేరారు.‌ ‌తంగేడు రాజుల కుటుంబానికి చెందిన వైయస్ఆర్‌సీపీ నేతలు రాజా సాగి సీతారామరాజు, రాజా సాగి రామభద్రరాజు (ఏటికొప్పాక చక్కెర ఫ్యాక్టరీ మాజీ ఛైర్మన్) ఇద్దరూ కలిసి సూర్యనారాయణరాజును వెంట తీసుకుని శ్రీ జగన్ వద్దకు వచ్చారు.
ఆయనతో పాటు ఆ ప్రాంతానికి చెందిన పలువురు నేతలకు కూడా శ్రీ జగన్ కండువాలు వేసి పార్టీలో చేర్చుకున్నారు.‌ ఇప్పటికే పార్టీలో చేరిన విశాఖపట్టణం (పశ్చిమ) ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో ఆయన నియోజకవర్గానికి చెందిన పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు కూడా వైయస్ఆర్‌సీపీలో చేరారు. విశాఖపట్టణం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ కూడా ఈ సందర్భంగా ఉన్నారు.

పార్టీలో చేరిన కర్నూలు నాయకులు :
మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలుకు చెంది మహ్మద్ పాషా (రాష్ట్ర వ‌క్ఫుబోర్డు సభ్యుడు) ఎస్. చాంద్‌పాషా (జిల్లా వక్ఫుబోర్డు ఛైర్మన్), అక్బర్ సాహె‌బ్ (జిల్లా వ‌క్ఫు కమిటీ సభ్యుడు), హెచ్.కె.మనోహర్ (జిల్లా బ్రాహ్మణ సంఘం కార్యదర్శి), మైనారిటీ నేత అమీరుద్దీ‌న్ గురువారం‌నాడు శ్రీ వైయస్ జ‌గన్మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చి ఆయన సమక్షంలో పార్టీలో చేరారు.

డాక్టర్‌ రవిబాబుకు పార్టీ సభ్యత్వం :
ఖమ్మం జిల్లా ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన డాక్టర్ రవిబాబు నాయక్ శ్రీ‌ వైయస్ జగ‌న్ సమక్షంలో వై‌యస్ఆర్‌సీపీలో చేరారు. ఖమ్మం లోక్‌సభా నియోజకవర్గం పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రవిబాబును వెంట తీసుకుని వచ్చి పార్టీలో చేర్పించారు.

Back to Top