వైయస్‌ విజయమ్మ 'ఫీజు దీక్ష' ప్రారంభం

హైదరాబాద్, 18 జూలై 2013:

ఫీజు రీ ఎంబర్సుమెంట్‌ పథకానికి తూట్లు పొడుస్తున్న ప్రభుత్వం తీరును నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ మరోసారి ఆందోళన‌లు ప్రారంభించింది. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ‌ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఫీజు దీక్ష మొదలుపెట్టారు. దీక్షా ప్రాంగణంలో‌ మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఆమె దీక్షకు కూర్చున్నారు.

ఫీజు రీయింబర్సుమెంట్‌పై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మూడవసారి శ్రీమతి విజయమ్మ రెండు రోజులు నిరాహార దీక్ష చేపట్టారు. 'పెద్ద చదువులు- పేదోళ్ల హక్కు' నినాదంతో నేడు, రేపు ఆమె దీక్ష చేస్తారు. శ్రీమతి విజయమ్మకు మద్దతుగా పలువురు నాయకులు కూడా నిరాహార దీక్షలో కూర్చుకున్నారు. శ్రీమతి విజయమ్మ ఫీజు దీక్షకు విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

జంటనగరాలలో భారీ వర్షాలు కురుస్తున్నందున దీక్షకు వచ్చే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పార్టీ నాయకులు పక్కాగా ఏర్పాట్లు చేశారు. దాదాపు 200 మీటర్ల పొడవు, 60 అడుగుల వెడల్పుతో రెయిన్ ఫ్రూ‌ఫ్ టెంట్లు దీక్షా స్థలిలో వేయించారు.

తాజా వీడియోలు

Back to Top