మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలి

హైదరాబాద్, 8 జూలై 2013:

సిటీలైట్ హోట‌ల్ భవనం కుప్పకూలి‌న దుర్ఘటనలో మృతి చెందిన ఒక్కొక్కరి కుటుంబానికి పది లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.‌ హోటల్ భవనం కూలిన సంఘటనపై ‌ఆమె తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. సికింద్రాబాద్ రాష్ట్రపతి రో‌డ్డులో‌ ఉన్న సిటీలైట్‌ హొటల్‌ భవనం సోమవారం ఉదయం కుప్పకూలిపోయిన దుర్ఘటనలో 13 మంది మరణించగా పలువురు క్షతగాత్రులైన విషయం తెలిసిందే.

Back to Top