వరద బాధితులకు విజయమ్మ పరామర్శ

హైదరాబాద్, 20 జూలై 2013:

ఆదిలాబా‌ద్ జిల్లా‌లోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ శనివారం ఉదయం బయలుదేరి వెళ్లారు. ఆదిలాబాద్ జిల్లాలో మూడు రోజులు‌గా ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలో ప్రవహిస్తున్న గోదావరి నదికి వరద పోటెత్తింది. జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జైన‌థ్ మండలం పెండ‌ల్‌వాడలో వరద బాధితులను శ్రీమతి విజయమ్మ కలుసుకుని పరామర్శిస్తారు. ఆదిలాబాద్, భోరజ్, తర్నా(బి) నిజాంపూర్, బాలాపూర్, సానాపూర్, లేఖర్‌వాడల మీదుగా పెండల్‌వాడకు శ్రీమతి విజయమ్మ చేరుకుంటారు. ఈ పర్యటనలో ఆమె వెంట వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ‌నాయకులు కొండా సురేఖ, బి. జనక్ ప్రసా‌ద్ ఉన్నారు.

అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీయింబ‌ర్సుమెంట్ పథకాన్ని‌ సంతృప్త స్థాయిలో వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తూ శ్రీమతి విజయమ్మ గురు, శుక్రవారాలు రెండు రోజులు నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్ర నిరాహార దీక్ష విరమించిన శ్రీమతి విజయమ్మ మరి కొన్ని గంటల్లోనే ఆదిలాబాద్‌ జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల పరిశీలనకు బయలుదేరి వెళ్ళడం గమనార్హం. శుక్రవారం ఫీజు దీక్షా వేదిక నుంచి శ్రీమతి విజయమ్మ మాట్లాడుతూ.. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, సంభవిస్తున్న వరదల కారణంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ‌ఆ ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు చొరవ తీసుకుని సహాయక చర్యలు చేపట్టాలని, బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలోని వరద బాధిత ప్రాంతాలను ‌తాను స్వయంగా సందర్శించనున్నట్లు ఆమె ప్రకటించారు.

Back to Top