ఖమ్మం, నల్గొండలలో నేడు విజయమ్మ పర్యటన

హైదరాబాద్, 31 అక్టోబర్ 2013:

ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు, వరద ముంపు ప్రాంతాలతో వైయస్ఆర్ కాంగ్రె‌సస్ పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ నేడు ఖమ్మం‌ నల్గొండ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఉదయానికే ఆమె మధిర చేరుకున్నారు. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు ముంచెత్తిన ప్రాంతాల్లో పర్యటించి, బాధితులను శ్రీమతి విజయమ్మ పరామర్శిస్తారు. ఖమ్మం జిల్లాలోని మధిరతో పాటు వైరా, పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో ఆమె పర్యటిస్తారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి, పత్తి, మొక్క జొన్న పంటలను పరిశీలిస్తారు. రైతుల సమస్యల్ని తెలుసుకుంటారు.

భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణ, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలో శ్రీమతి విజయమ్మ గత నాలుగు రోజులుగా పర్యటించి బాధితుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆదుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు.

Back to Top