పేదల జీవితాల్ని వారిద్దరూ దుర్భరం చేశారు

కర్నూలు:

చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి తమ హయాంలలో ఒక్కసారిగా పన్నులు పెంచేసి పేద, సామాన్య, మధ్య తరగతి కుటుంబాల జీవితాలను దుర్భరం చేశారని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు హయాంలో ఎనిమిదిసార్లు, కిరణ్ హయాంలో నాలుగుసార్లు విద్యు‌త్ చార్జీలు పెంచార‌న్నారు. వీటితో పాటు ఆర్టీసీ, నీటి పన్నులు, మున్సిపాలిటీ పన్నులు, గ్యాస్, పెట్రోల్, డీజిల్, కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి ప్రజల జీవితాలపై దెబ్బ కొట్టారన్నారు. శ్రీమతి విజయమ్మ కర్నూలు జిల్లాలో నాలుగవ రోజు ఆదివారం ఎన్నికల ప్రచారం కొనసాగింది. డోన్, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలలో ఆమె రోడ్‌షో, బహిరంగ సమావేశాలు నిర్వహించారు. అడుగడుగునా ప్రజలు శ్రీమతి విజయమ్మకు ఎదురు వచ్చి మరీ ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి.

రూ.32 వేల కోట్ల కరెంట్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపిన కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్షాలన్నీ అవిశ్వాసం పెడితే చంద్రబాబు విప్ జారీచేసి మరీ కాపాడారన్నారు. ఇప్పుడు విద్యు‌త్ చార్జీల పేరుతో మరో రూ.5,600 కోట్ల భారం వేయబోతున్నారని నిప్పులు చెరిగారు. ‘జనం గుండెల్లోనే గూడుకట్టుకుని ఉన్న వైయస్ఆర్‌ పాలన సువర్ణ యుగం. అలాంటి పాలన మళ్ళీ జగన్‌బాబుతోనే సాధ్యమవుతుంది. ఈ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీని గెలిపించి జగన్‌బాబును సీఎంను చేద్దాం’ అని శ్రీమతి విజయమ్మ కోరారు.

తాజా వీడియోలు

Back to Top