తెలంగాణ అమరులకు విజయమ్మ నివాళులు

జోగిపేట (మెదక్‌ జిల్లా),

25 జూన్‌ 2013: తెలంగాణ అమరవీరులకు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ నివాళు‌లు అర్పించారు. మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా ఆమె జోగిపేటలో జరిగిన పార్టీ శ్రేణుల సభలో ప్రసంగించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో శ్రీమతి విజయమ్మ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె మంగళవారంనాడు మెదక్‌ జిల్లా జోగిపేట సభలో ప్రసంగించారు. ఈ ప్రసంగానికి ముందు శ్రీమతి విజయమ్మ తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

అంతకు ముందు శ్రీమతి విజయమ్మ హైదరాబాద్ నుంచి మెదక్‌ జిల్లా పర్యటనకు వస్తూ సింగూరు ప్రాజెక్టు కాలువల నిర్మాణ పనులను పరిశీలించారు. జోగిపేట మండల కార్యాలయం ఎదుట ఉన్న మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Back to Top