వైయస్ సువర్ణయుగాన్ని జగన్‌ మళ్ళీ తెస్తారు

గుంటూరు :

‘చంద్రబాబు నాయుడు తన తొమ్మిదేళ్ల పాలన మళ్ళీ తీసుకొస్తానని ప్రజలను ఓట్లు అడగలుగుతారా? ఆయన హయాంలో రాష్ట్రానికి కనీసం నూరు కోట్ల ప్రాజెక్టు ఒక్కటైనా తెచ్చారా? ఒక పరిశ్రమనైనా తెచ్చారా?. ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఒకటైనా చంద్రబాబు నిలబెట్టుకున్నారా అంటే అదీ లేదు. ఇలాంటి వారిని నమ్మొద్దని మరొక్కసారి చెబుతున్నా. చంద్రబాబు మాయమాటల్లో పడొద్దని మనవి చేస్తున్నా. ఐదేళ్ళ మూడు నెలల కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో వైయస్ రాజశేఖరరెడ్డి నాటి సువర్ణ యుగాన్ని మళ్లీ తీసుకురాగలమనే ధైర్యంతో మేం మీ ముందుకు రాగలుగుతున్నాం. ఓట్లు అడగగలుగుతున్నాం. రాష్ట్రంలో మళ్లీ వైయస్ రాజశేఖరరెడ్డి నాటి సువర్ణయుగం మాదిరిగానే సంక్షేమ రాజ్యం ఏర్పాటు చేసుకుందాం. ఇందుకు రానున్న ఎన్నికల్లో వై‌యస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీకి పట్టంకడదాం’ అని పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పిలుపునిచ్చారు.

‌గుంటూరు జిల్లాలో ఆదివారం నిర్వహించిన ‘వైయస్ఆర్ జనభేరి’ ‌ఎన్నికల ప్రచార కార్యక్రమంలో శ్రీమతి విజయమ్మ ప్రసంగించారు. ఉదయం 9.30 గంటలకు ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం తెలగవారిపాలెం నుంచి శ్రీమతి విజయమ్మ రోడ్‌షో ప్రారంభమై ప్రత్తిపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో నిర్వహించారు.

Back to Top