యాదయ్య కుటుంబానికి విజయమ్మ పరామర్శ

మహబూబ్నగ‌ర్, 29 జూన్‌ 2013:

జమ్మూకాశ్మీర్‌లో కొద్ది రోజుల క్రితం ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన జవాను యాదయ్య కుటుంబాన్ని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి విజయమ్మ పరామర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా‌ పర్యటనకు శనివారం వచ్చిన శ్రీమతి విజయమ్మ వంగూరు మండలం కొండారెడ్డిపల్లెకు వెళ్లి యాదయ్య కుటుంబ సభ్యులను కలుసుకుని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ తరపున లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని చె‌క్ ద్వారా యాదయ్య కుటుంబ సభ్యులకు అం‌దజేశారు.

జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్లో‌ గత సోమవారం ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో యాదయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. దేశం కోసం వీర మరణం పొందిన యాదయ్య గర్వనీయుడని శ్రీమతి విజయమ్మ ఈ సందర్భంగా నివాళులు అర్పించారు. యాదయ్య కుటుంబ సభ్యులకు ఆమె ధైర్యం చెప్పారు.

Back to Top