ఉప్పునూతల మృతికి విజయమ్మ సంతాపం

హైదరాబాద్, 3 ఆగస్టు 2013:

వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకుడు, మాజీ మంత్రి ఉప్పనూతల పురుషోత్తంరెడ్డి మరణం పార్టీకి తీరని లోటు అని పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ అన్నారు. ‌పురుషోత్తంరెడ్డి మృతి పట్ల ఆమె తీవ్ర సంతాపం ప్రకటించారు. శనివారం ఉదయం ఉప్పనూతల నివాసానికి వెళ్ళి శ్రీమతి విజయమ్మ ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఉప్పునూతల కుటంబ సభ్యులను పరామర్శించి వారికి సానుభూతి తెలిపారు.

Back to Top