ప్రజలను తిప్పలు పెట్టిన ఘనుడు చంద్రబాబు


‌కడప:

‘ఎన్టీఆర్‌కు ప్రజలు నమ్మకంతో అధికారం అప్పగిస్తే వెన్నుపోటుతో ఆ అధికారాన్ని లాక్కున్న చంద్రబాబు నాయుడు తర్వా త ప్రజలకు వరుసగా పన్నుపోటు పొడిచారు. హార్సుపవర్ మోటార్లకు రూ.50తో విద్యు‌త్ సరఫరా చేయాలని ఎన్టీఆ‌ర్ నిర్ణయిస్తే చంద్రబాబు దాన్ని రూ.600కు పెంచారు. కిలో రూ.2 బియ్యాన్ని ఐదు రూపాయల పావలా చేశారు. గ్రామ గ్రామాన బె‌ల్టు షాపులు తెరిచారు. తొమ్మిదేళ్ల పాలనలో ఎనిమిది సార్లు కరెంటు చార్జీలు పెంచారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని ప్రజలు ధర్నాలు చేస్తే బషీ‌ర్‌బాగ్‌లో కాల్పులు జరిపించారు. తొమ్మిదేళ్ళు చంద్రబాబు పాలన చూసిన ప్రజానీకం అందుకే ఆయనను ఇన్నేళ్లపాటు అధికారానికి దూరంగా ఉంచి యావజ్జీవ శిక్ష విధించారు’ అని వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ధ్వజమెత్తారు.

‌ఖమ్మం, పశ్చిమగోదావరి జిల్లాల్లో మంగళవారం పర్యటించిన శ్రీమతి విజయమ్మ బుధవారం సాయంత్రం వైయస్ఆర్ జిల్లా రాయచోటి మున్సిపాలిటి పరిధిలో రో‌డ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు చోట్ల ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ‘నాలుగున్నరేళ్ళు మనం పడ్డ కష్టాలకు చరమగీతం పాడే రోజు అతి చేరువలో ఉంది. ప్రజలు మెచ్చిన ‌మహా నాయకుడు వైయస్ రాజశేఖరరెడ్డి. ఆయనలో ఉన్న పట్టుదల, దీక్ష, దక్షత, పోరాట పటిమ జగన్‌బాబులోనూ ఉన్నాయి. మన కష్టాలు మనమే తీర్చుకునే రోజులు ఆసన్నమయ్యాయి’ అని శ్రీమతి విజయమ్మ అన్నారు.

Back to Top