వీరఘట్టం మీదుగా నేడు షర్మిల పాదయాత్ర

నడుకూరు (శ్రీకాకుళం జిల్లా),

22 జూలై 2013: వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం 217వ రోజు సోమవారం శ్రీకాకుళం జిల్లా నడుకూరు నుంచి ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లాలో రెండవ రోజు కొనసాగే పాదయాత్ర వివరాలను పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్‌ ధర్మాన పద్మప్రియ వివరించారు. నడుకూరు నుంచి శ్రీమతి షర్మిల వీరఘట్టం మీదుగా కొనసాగుతుందని తెలిపారు. వీరఘట్టం సమీపంలో మధ్యాహ్న భోజనం అనంతరం రేగళ్లపాడు జంక్షన్, బొడ్లపాడు జంక్షన్, వండువ జంక్షన్, నవగాంల మీదుగా శ్రీమతి షర్మిల పాదయాత్ర సాగుతుంది. నవగాం సమీపంలో ఆమె సోమవారం రాత్రికి బస చేస్తారని రఘురాం, పద్మప్రియ తెలిపారు.

Back to Top