గురువారం పాదయాత్ర షెడ్యూల్‌ 16.1 కి.మీ

చెట్టుపల్లి (విశాఖ జిల్లా),

27 జూన్‌ 2013: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పాదయాత్ర 192వ రోజు షెడ్యూల్‌ను పార్టీ కార్యక్రమాల కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, విశాఖ జిల్లా కన్వీనర్ గొల్ల బాబూరావు ప్రకటించారు.‌ శ్రీమతి షర్మిల గురువారం ఉదయం నర్సీపట్నం నియోజకవర్గంలోని చెట్టుపల్లిలో పాదయాత్ర ప్రారంభిస్తారని వారు తెలిపారు. అక్కడి నుంచి ఆమె వెలంకాయపాలెం వద్ద చోడవరం నియోజకవర్గంలో ప్రవేశిస్తారన్నారు. రోలుగుంట సమీపంలో మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారని తెలిపారు.

భోజన విరామం అనంతరం బయలుదేరి భోగాపురం, కొత్తకొట మీదుగా పాదయాత్రను కొనసాగించి దొండపూడి వరకూ నడుస్తారన్నారని రఘురాం, బాబూరావు వివరించారు. దొండపూడి సమీపంలో శ్రీమతి షర్మిల విశాఖ జిల్లాలో నాలుగవ రోజు పాదయాత్ర షెడ్యూల్ ముగుస్తుంది. ‌దొండపూడి సమీపంలోనే శ్రీమతి షర్మిల గురువారం రాత్రికి బస చేస్తారని వారు వెల్లడించారు. కాగా, గురువారం నాడు శ్రీమతి షర్మిల పాదయాత్ర మొత్తం 16.1 కిలోమీటర్లు కొనసాగుతుంది.

Back to Top