చిత్తూరు జిల్లా నుంచి షర్మిల బస్సు యాత్ర

హైదరాబాద్, 1 సెప్టెంబర్ 2013:

అన్ని ప్రాంతాలకూ సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ వై‌యస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల సెప్టెంబర్‌ 2వ తేదీన తిరుపతి నుంచి ప్రారంభిస్తారు. శ్రీమతి షర్మిల బస్సు యాత్ర షెడ్యూల్‌ను పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, చిత్తూరు జిల్లా పార్టీ నాయకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి శనివారం ప్రకటించారు.
‘సెప్టెంబర్ 2న ఉదయం‌ శ్రీమతి షర్మిల ఇడుపులపాయ చేరుకొని మహానేత, తన తండ్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి 4వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తారు. అదే రోజు సాయంత్రం చిత్తూరు జిల్లా తిరుపతికి చేరుకొని సాయంత్రం అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రికి తిరుపతిలోనే బస చేస్తారు’ అని రఘురాం, మిథున్‌రెడ్డి చెప్పారు.
శ్రీమతి షర్మిల 3వ తేదీ ఉదయం చిత్తూరులో జరిగే బహిరంగ సభలో, అదే రోజు సాయంత్రం మదనపల్లి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మదనపల్లిలోనే ఆ రోజు రాత్రికి బస చేస్తారు.
4వ తేదీ ఉదయం అనంతపురం జిల్లా కదిరి బహిరంగ సభలోను, సాయంత్రం అనంతపురం బహిరంగ సభలో ఆమె పాల్గొంటారు. అనంతపురం పట్టణంలోనే ఆ రాత్రికి రాత్రి బస చేస్తారు.
5న ఉదయం కర్నూలు జిల్లా డోన్‌లో జరిగే బహిరంగ సభలోను, సాయంత్రం కర్నూలు బహిరంగ సభలో పాల్గొంటారు. కర్నూలు పట్టణంలో ఆ రోజు రాత్రికి బస చేస్తారు.
6వ తేదీ ఉదయం కర్నూలు జిల్లా నంద్యాల బహిరంగ సభలోను, సాయంత్రం ఆళ్లగడ్డ బహిరంగ  సభలో ప్రసంగిస్తారు. ఆళ్లగడ్డలోనే ఆ రాత్రికి శ్రీమతి షర్మిల బస చేస్తారు.
7వ తేదీ ఉదయం వైయస్ఆర్ జిల్లా మైదుకూరు బహిరంగ సభలో‌ను, సాయంత్రం బద్వేలు బహిరంగ సభలో ఆమె పాల్గొంటారు.

Back to Top