ఇది ప్రజాస్వామ్య దేశమని మరిచిన కాంగ్రెస్‌

పలమనేరు (చిత్తూరు జిల్లా),

3 సెప్టెంబర్ 2013: టిఆర్ఎస్‌ను కలుపుకుని కేంద్రంలో లబ్ధి పొందేందుకు గొడ్డలితో నరికినట్టు మన రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ముక్కలు చేసిందని శ్రీమతి షర్మిల ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ అంతటి సాహసం చేయడానికి కారణం మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడే అని దుమ్మెత్తిపోశారు. తెలంగాణను ఇచ్చేసుకోండని బ్లాంక్ చెక్కులా కేంద్రానికి చంద్రబాబు లేఖ రాసిచ్చేశారని ఆరోపించారు. 'సమైక్య శంఖారావం' బస్సు యాత్ర రెండవ రోజు మంగళవారం ఆమె చిత్తూరు జిల్లా మదనపల్లికి వెళుతూ మార్గమధ్యలో కొద్దిసేపు పలమనేరులో అభిమానులు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. బస్సు యాత్ర షెడ్యూల్‌లో లేకపోయినా పలమనేరులో ఆమె వెళుతున్న దారిలో వేలాది మంది ప్రజలు, అభిమానులు వచ్చి మాట్లాడమని విజ్ఞప్తి చేయడంతో ప్రసంగించారు. ఒక టిడిపి నాయకుడు తనను తానే కొట్టుకుంటున్నట్లు వేసిన పోస్టర్‌ను చూసి శ్రీమతి షర్మిల వ్యాఖ్యానిస్టూ.. ఆ నాయకుడు కొరడాతో చంద్రబాబు నాయుడిని కొట్టి ఉంటే ఆయన ఇచ్చిన విభజన లేఖను వెనక్కి తీసుకుని ఉండేవారేమో అని చమత్కరించారు.

ఏ ఒక్క ప్రాంతానికీ అన్యాయం జరగకుండా, ఒక తండ్రిలా అందరికీ న్యాయం చేయాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచీ ఒకే మాట చెప్పిందని శ్రీమతి షర్మిల తెలిపారు. అందరినీ పిలిచి చర్చించాలని పదే పదే చెప్పిందన్నారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ నిరంకుశ ధోరణితో ఇది ప్రజాస్వామ్య దేశమని కూడా మరిచిపోయి విభజన విషయంలో వ్యవహరించిందని విమర్శించారు. సమన్యాయం చేయలేకపోతే విభజించే అధికారం ఎలా ఉంటుందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నించిందన్నారు. న్యాయం చేయడం కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశం కాదని తేలిపోయిన నేపథ్యంలో రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోందన్నారు. న్యాయం చేయడం కాంగ్రెస్‌ పార్టీకి చేతగాదని తేలిపోయింది గనుక మన రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్‌ చేస్తోందన్నారు. అప్పటి వరకూ ప్రజల తరఫున జగనన్న నాయకత్వంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని అన్నారు.

తెలంగాణకు అనుకూలంగా రాష్ట్ర విభజనకు చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చిన కారణంగా సమైక్యాంధ్రకు కట్టుబడిన స్థానిక నాయకుడు అమర్నాథ్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవిని వదిలిపెట్టారని పేర్కొన్నారు. వైయస్ఆర్‌ పరిపాలన తీరు చూసి, జగనన్న నాయకత్వంలో మన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత రాజన్న ప్రతి పథకానికీ జీవం పోస్తారని హామీ ఇచ్చారు.

Back to Top