అందరికీ పక్కా ఇళ్ళు జగనన్నకే సాధ్యం


విజయవాడ/ గుంటూరు:

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్ళు ఉండే బాధ్యతను జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత తన భుజాన వేసుకుంటారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల తెలిపారు. రానున్న రాజన్న రాజ్యంలో రైతన్న నష్టపోకుండా రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తారన్నారు. రైతులు, మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తారని హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళా సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి బహిరంగసభల్లో మంగళవారంనాడు శ్రీమతి షర్మిల ప్రసంగించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు, పెడన మున్సిపాలిటీల్లో రోడ్‌షోలలో ప్రసంగించారు.

అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి అమ్మ తన పిల్లలను చదివించుకోవడానికి ఒక్కొక్క బిడ్డకు రూ. 500లు చొప్పున ఇద్దరికి రూ. 1,000 నేరుగా అమ్మ బ్యాంకు ఖాతాలోనే వేస్తారని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛను పెంచుతారని చెప్పారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంట్, 108 వంటి పథకాలన్నీ మహానేత వైయస్ ‌రాజశేఖరరెడ్డి మాదిరిగానే అమలు చేస్తారని ఆమె ప్రకటించారు. అందుకే మహానేత రాజశేఖరరెడ్డిని గుర్తుచేసుకుని ఫ్యాను గుర్తు మీద అమూల్యమైన ఓటు వేసి జగనన్న నాయకత్వాన్ని బలపర్చాలని శ్రీమతి షర్మిల కోరారు.

రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చి సహకరించిన చంద్రబాబు సీమాంధ్రలో అడుగుపెడితే ఏ ముఖం పెట్టుకొని వచ్చావని ఆయనను తరిమి తరిమి కొట్టాలని శ్రీమతి షర్మిల ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Back to Top