విజయమ్మకు షర్మిల, భారతి సంఘీభావం

గుంటూరు 22 ఆగస్టు 2013:

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల గురువారం సమర దీక్షా ప్రాంగణాన్ని సందర్శించారు. తన వదిన, శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి భార్య అయిన శ్రీమతి వైయస్ భారతితో కలిసి ఆమె ఇక్కడికి విచ్చేశారు. సమన్యాయం చేయాలనీ, లేదా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనీ డిమాండు చేస్తూ నిరవధిక దీక్ష చేపట్టిన తన మాతృమూర్తి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు అయిన శ్రీమతి వైయస్ విజయమ్మను కలిసేందుకు ఆమె ప్రత్యేకంగా విచ్చేశారు. శ్రీమతి విజయమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. దీక్షకు సంఘీభావాన్ని తెలిపారు. శ్రీమతి భారతి, శ్రీమతి షర్మిల శ్రీమతి విజయమ్మకు ఇరువైపులా కూర్చుని సందర్శకులకు అభివాదం చేశారు. సమర దీక్ష ప్రాంగణంలో శ్రీమతి షర్మిలతో కరచాలనం చేసేందుకు ప్రజలు పార్టీ కార్యకర్తలు పోటీ పడ్డారు. పార్టీ నేతలు అంబటి రాంబాబు, తదితరులు తొలుత శ్రీమతి భారతి, శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికారు. గురువారం నాటికి శ్రీమతి విజయమ్మ దీక్ష నాలుగో రోజుకు చేరింది.

Back to Top