చిరు వ్యాపారులకు ఆసరా కల్పించాలి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం జిల్లా కార్యదర్శి రాఘవరెడ్డి
తాడికొండ రూరల్‌: తాడికొండలో రోడ్డు విస్తరణ కారణంగా దుకాణాలు కోల్పోయిన చిరు వ్యాపారులను  గ్రామ పంచాయతీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం జిల్లా కార్యదర్శి మల్లంపాటి రాఘవరెడ్డి డిమాండ్‌ చేశారు. గ్రామ పంచాయతీ వద్ద నుంచి గ్రామాభ్యుదయ కమిటీ భవనం వరకు ఖాళీగా ఉన్న స్థలంలో ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా లేక గ్రామ పంచాయతీ వారు స్వయంగా  దుకాణాలను నిర్మించి చిరు వ్యాపారులకు అద్దె ప్రాతిపదికన ఇస్తే ఆసరా కల్పించిన వారవుతారన్నారు. ప్రస్తుతం అద్దెలకు భారీగా డిమాండ్‌ ఏర్పడిన నేపధ్యంలో చిరు వ్యాపారులకు ప్రధాన కూడలిలో అద్దెలు భారంగా మారాయని, గ్రామ పంచాయతీ స్థలాలు కూడా ఆక్రమణలకు గురి కాకుండా కాపాడేందుకు ఖాళీ ప్రాంతంలో దుకాణాలు నిర్మించి చిరు వ్యాపారులకు కేటాయించే మంచి ఆలోచన చేయాలని ఆయన హితవు పలికారు. 
Back to Top