టచ్ లో ఆరుగురు ఎమ్మెల్యేలు

నెల్లూరుః పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా పశ్చాత్తాపడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, సంజీవయ్యలు అన్నారు. విజయసాయిరెడ్డి విజయం తథ్యమని వారు చెప్పారు. ఇక ఆరుగురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని,  సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతామని వారు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ.... వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులను విమర్శించేందుకే మహానాడు నిర్వహించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. పేదల గుండెల్లో ఉన్న వైయస్ఆర్ సీపీని ఏమీ చేయలేరని నల్లపరెడ్డి అన్నారు. రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతికి  తాము పూర్తి వ్యతిరేకమని చెప్పారు. ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదని ఆరోపించారు. 
Back to Top