బాబు స్వార్థం వల్లే కష్టాలు

పట్టిసీమ నీళ్లొద్దు..మా నీళ్లు మాకు కావాలి
శ్రీశైలంలో 854 అడుగుల లెవల్ మెయింటైన్ చేయాలి
దిగువకు అడ్డగోలుగా నీళ్లు తోడుకుపోయి మా పొట్ట కొట్టొద్దు
ఇప్పటికైనా బాబు పబ్లిసిటీ స్టంట్స్ మానుకోవాలి
దేవినేని ఉమ బాధ్యతారహితంగా మాట్లాడడం తగదు
వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి

హైదరాబాద్:  చంద్రబాబు రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. పవర్ పేరుతో తన స్వార్థ ప్రయోజనాల కోసం దిగువకు నీళ్లు తోడుకుపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు పట్టిసీమ నీళ్లొద్దని, తమకు రావాల్సిన వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 
హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే.....

 • చంద్రబాబు నిర్వాకం వల్లే గతేడాది  చుక్కనీరు అందక రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలు కరువుతో అల్లాడిపోయారు. 
 • బాబు తన పబ్లిసిటి స్టంట్స్ మానుకోవాలి. గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయకుండా చూసుకోవాలి. 
 • ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి నీరు వస్తున్నందున దానిలో 854 అడుగుల లెవల్ మెయింటైన్ చేయాలి. 
 • పవర్ పేరు చెప్పి మీ స్వార్థ ప్రయోజనాల కోసం నీళ్లను దిగువకు వదిలి రాయలసీమ ప్రజల కడుపుకొట్టొద్దు. 
 • పట్టిసీమ కట్టేది రాయలసీమకోసమేనన్న భ్రాంతిని తీసుకొచ్చారు. నీళ్లు అడ్డుకుంటున్నారని మాట్లాడారు. 
 • పట్టిసీమ మాకొద్దు. రాయలసీమనుంచి వచ్చే మానీళ్లు సముద్రంలో కలపొద్దు. మా నీళ్లు మాకిస్తే చాలు. 
 • పట్టిసీమ ప్రాజెక్టును మూడుసార్లు ప్రారంభించినా ఇప్పటికీ గోదావరి నీళ్లు కృష్ణా నదిలో కలవలేదు.
 • సీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు 200 టీఎంసీలు తగ్గకుండా శ్రీశైలం నీళ్లు ఇవ్వాలి. 
 • అలా ఇవ్వాలంటే ఎప్పటికీ 854 అడుగులు మెయింటైన్ చేయాలి. అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది.
 • వ్యవసాయమన్నదే లేని పరిస్థితుల్లో  మహానేత వైయస్సార్ సాహసోపేతంగా జలయజ్ఞాన్ని తీసుకొచ్చి ఎన్నో ప్రాజెక్ట్ లను పూర్తి చేసే దిశకు తీసుకొచ్చారు. 
 • పోలవరం క్లియరెన్స్ రాకపోయినా పట్టుపట్టి మొక్కవోని దీక్షతో ప్రాజెక్ట్ లు చేస్తూ కుడి, ఎమడ కాల్వలను మొదలుపెట్టారు.
 • రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ పూర్తి కావచ్చినా దానికి కారకులు వైయస్ రాజశేఖర్ రెడ్డి. 
 • మంత్రి దేవినేని ఉమ బాధ్యతారాహితంగా మాట్లాడుతున్నారు. వైయస్సార్ పై ఆరోపణలు చేసేముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది.
 • తెలంగాణలో విశ్లేషకులు విద్యాసాగర్ రావు ఏం చెప్పారో ఉమ తెలుసుకుంటే బాగుంటుంది.
 • పట్టిసీమ పేరుతో టీడీపీ నేతలు రూ.  2 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. 
 • మిగిలిపోయిన 10 శాతం పనులకు నాలుగింతలు రేట్లు పెంచి అధికారులే కాంట్రాక్టర్ లుగా మారి దోచుకున్నారు. 
 • చంద్రబాబు, మంత్రులు ముందు దాన్ని సమీక్షించుకుంటే బాగుంటుంది.
 • వైయస్సార్ తవ్వించిన కెనాల్ ద్వారా నీళ్లు తోడి నధుల అనుసంధానం చేశామని  బాబు గొప్పలు చెప్పుకుంటున్నారు.
 • పదే పదే టీడీపీ నేతలు  విమర్శలు చేయడం మానుకోవాలి. 
 • పట్టీసమ నీళ్లు మాకొద్దు. మా నీళ్లు మాకు ఇవ్వాలి. 
 • వైయస్సార్ హయాంలో 854 అడుగుల లెవల్ మెయింటైన్ చేయాలని జీవో విడుదలైంది.  
 • ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని భవిష్యత్తులో ఎప్పుడూ ఇబ్బంది రాకుండా జీవో అమలయ్యేలా చూడాలి. 
 • బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు రానున్న నేపథ్యంలో ఆరు జిల్లాలకు న్యాయం జరిగేలా చంద్రబాబు దృష్టిసారించాలి. 
 • రాయలసీమ ప్రజల చిరకాల వాంఛ సిద్దేశ్వరం ప్రాజెక్ట్ పూర్తిచేయాలి.  
అని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 
Back to Top