కళ్యాణ వైభోగమే..శ్రీ సీతారాముల కళ్యాణం

మల్కాపురం:  49వ వార్డు మల్కాపురం పల్లివీది వద్ద గల సీతారామాలయంలో స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమంలో వైయస్సార్‌ సీసీ పశ్చిమ సమన్వయకర్త,మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్,వార్డు అధ్యక్షుడు పిలక రాము,కాంగ్రెస్‌ నాయుకులు భోగవళ్లి నాగభూషణం,వాల్కంపేట యువత సభ్యులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలికించి పానకం సేవించారు. అదేవిధంగా మల్కాపరం రెడ్డివీది వద్ద జరిగిన కార్యక్రమంలో,ప్రకాష్‌నగర్‌ శివరామకృష్ణ దేవాలయం,బాపుజీకాలనీ,జనతకాలనీ,ఆర్‌కే పురం,ఏకేసీకాలనీ,పిలకవానిపాలెం వద్ద జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణాని మళ్ల విజయప్రసాద్‌ తిలికించారు.అదేవిధంగా 46వ వార్డు పిలకవానిపాలెం వద్ద వేమన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సీతారాముల కళ్యాణంలో వైయస్సార్‌ సీపీ రాష్ట్ర నాయుకులు,పెందూర్తి మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి పాల్గొని సీతారాములను దర్శించుకుని పూజలు జరిపారు.47వ వార్డు పాత చెక్కుపోస్టు ఏరియా వద్ద గల సాయిబాబా ఆలయం వద్ద జరిగిన సీతారాముల కళ్యాణంలో యాదవ సంఘ ప్రతినిధులు పుర్రి అప్పారావుయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.
 
Back to Top