ప్రజాస్వామ్యానికే ప్రమాదం

ఎమ్మెల్యేలను కొనడం దారుణం
ఏపీ ఇలా అభివృద్ధి అవుతుందనుకోలేదు
అవినీతిని ఇక్కడితో ఆపకపోతే దేశానికే ప్రమాదం
పార్టీ ఫిరాయింపుల అంశంపై పార్లమెంట్ లో పోరాడుతాం
వైఎస్సార్సీపీ పోరాటానికి సీపీఎం పూర్తి మద్దతుః ఏచూరి

న్యూఢిల్లీః అవినీతి సొమ్ముతో ఎమ్మల్యేలను కొనడం దారుణమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఫైరయ్యారు. ఇలాంటి రాజకీయాలను దేశంలో తాను ఎప్పుడూ చూడలేదని ఏచూరి అన్నారు. కొత్త రాష్ట్రం ఏపీ అభివృద్ధి చెందుతుందని భావించాం గానీ ఇలా  అవినీతిలో అభివృద్ధి చెందుతుందని అనుకోలేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు ఓ పార్టీ తరపున గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం ప్రజాస్వామ్యానికే ప్రమాదమన్నారు. ఇది చాలా అవమానకరమన్నారు. ఈ అవినీతి రాజకీయాలను ఇక్కడితే ఆపకపోతే దేశంలో ప్రజాస్వామ్యమన్నదే లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసం కోల్పోతే వ్యవస్థలను ఎవరూ కాపాడలేరన్నారు. 

చట్టాలు ఉల్లంఘించి ఎమ్మెల్యేలను కొనుక్కోవడం దుర్మార్గమని ఏచూరి మండిపడ్డారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ అని సీతారాం ఏచూరి అన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు చేయాల్సిన అవసరం ఉందని...దీనిపై తాము పోర్లమెంట్ లో పోరాడుతామని ఏచూరి చెప్పారు. వైఎస్సార్సీపీ పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఉత్తరాఖాండ్ లో కన్నా ఘోరంగా ఏపీలో ఎమ్మెల్యేల కొనుగోళ్లు జరుగుతున్నాయని ఏచూరి ధ్వజమెత్తారు. ప్రజలు ఎవరికి ఓట్లు వేసి గెలిపిస్తారో దానికే విలువ లేకపోతే ఇక అర్థమేముంటుందని ఏచూరి వాపోయారు. ఎక్కడ వీలైతే అక్కడ ఫిరాయింపులపై పార్లమెంట్ లో పోరాడుతామన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు తీసుకొచ్చేలా కృషి చేస్తామన్నారు.  

చంద్రబాబు నీచ రాజకీయాలపై వైఎస్సార్సీపీ జాతీయ స్థాయిలో ఉద్యమిస్తోంది. సేవ్ డెమోక్రసీ నినాదంతో హస్తినలో పోరాటం కొనసాగిస్తోంది. ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బృందం  సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని పార్టీ ఆఫీసులో కలుసుకున్నారు. చంద్రబాబు అనైతిక రాజకీయాల గురించి వైఎస్ జగన్ ఏచూరికి వివరించారు. చంద్రబాబు ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తక కాపీని వైఎస్ జగన్ ఏచూరికి అందజేశారు. 
Back to Top