సిరిసిల్లలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ నేతల పర్యటన

హైదరాబాద్, 29 మార్చి 2013:

కరెంటు కోతలపై అసెంబ్లీ వేదికగా పోరాడిన వైయస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధమైంది. కోతలతో రైతులు, నేతన్నలు ఎదుర్కొంటున్న సమస్యల అధ్యయనానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. చేనేతల కొలువైన సిరిసిల్ల, మంత్రి పొన్నాల లక్ష్మయ్య నియోజకవర్గమైన జనగాం ప్రాంతాల్లో పర్యటనకు ఆ పార్టీ నేతలు శుక్రవారం ఉదయం బయలుదేరి వెళ్ళారు. ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలతో పాటు కొణతాల రామకృష్ణ, బాజిరెడ్డి గోవర్ధన్, కేకే మహేందర్ రెడ్డి ఈ బృందలో ఉన్నారు. వారు ఆయా ప్రాంతాలలోని రైతుల, నేతన్నల సమస్యలు తెలుసుకోనున్నారు.

Back to Top