ప్రతి గడపలో ఒకే మాట

 • ప్రజావ్యతిరేక టీడీపీని సాగనంపుతాం
 • వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకుంటాం
 • గడపగడపలో వైయస్సార్సీపీకి జన నీరాజనం
 • మోసకారి చంద్రబాబుపై ప్రజల మండిపాటు
 • ప్రజాబ్యాలెట్ లో బాబు పాలనకు సున్నా మార్కులు
 • మళ్లీ రాజన్నరాజ్యం రావాలని ప్రజల ఆకాంక్ష
 • వైయస్ జగన్ వస్తేనే తమ కష్టాలు తీరుతాయని విశ్వాసం

 • మహానేత, దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని వైయస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. వైయస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ప్రతీ గడపకు వెళ్లి టీడీపీ అవినీతి, అరాచకాలు, వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఇంటింటికీ వెళ్లి, ప్రజల కష్టాలు తెలుసుకొని మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. జగనన్న పాలన వస్తే సమస్యలన్నీ తీరుతాయని వివరిస్తున్నారు. 

  బాబు పాలనకు సున్నా మార్కులు..
  అదేసమయంలో ఈరెండేళ్లలో ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీలను ఏమేరకు నెరవేర్చారు అన్నదానిపై వంద ప్రశ్నలతో కూడిన కరపత్రాన్ని ప్రజలకు అందించి సమాధానాలు రాబడుతున్నారు. ప్రజాబ్యాలెట్ లో బాబు పాలనకు ఒక్క మార్కు కూడా పడడం లేదు. చంద్రబాబు పరిపాలనంతా శూన్యమని ప్రజలు నొక్కివక్కానిస్తున్నారు.  వైయస్సార్సీపీ నేతలు వెళ్లిన ప్రతీ చోట ప్రజలు అక్కున చేర్చుకొని ఆదరిస్తున్నారు. వైయస్సార్సీపీ చేపట్టిన గడపగడపకూ ఈకార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది.  ప్రతి ఒక్కరి నోట ఒకే మాట వినిపిస్తోంది. మాయమాటలతో నమ్మించి ఓట్లు వేయించుకొని తమను మోసం చేసిన టీడీపీని సాగనంపుతాం, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకుంటామని ప్రజలు నినదిస్తున్నారు. 

  జననేతతోనే అభివృద్ధి సాధ్యం..
  ఎన్నికల్లో రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి సహా వందలాది వాగ్ధానాలిచ్చిన చంద్రబాబు ...అవి నెరవేర్చకపోవడంపై  ప్రజలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తమ సమస్యలను పట్టించుకోకుండా విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నాడని మండిపడుతున్నారు. మహానేత వైయస్సార్ పాలన మళ్లీ రావాలని,  వైయస్ జగన్ సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని విశ్వసిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.

  అంతులేని అవినీతి కథ..!
  ఇంతింతై వటుడింతై అన్నట్లు రెండేళ్ల టీడీపీ పాలనలో అవినీతి, అరాచకాలు పెచ్చుమీరిపోయాయి. చంద్రబాబు సర్కార్ ప్రజలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇసుక నుంచి మట్టి దాకా టీడీపీ నేతలు రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. రెండేళ్ల కాలంలోనే బాబు పాలనలో అంతులేని కుంభకోణాలు వెలుగుచూశాయి. ప్రజాసంక్షేమాన్ని విస్మరించి ప్రతిపక్షాన్ని అణగదొక్కడమే ధ్యేయంగా టీడీపీ చేస్తున్న కుట్రలను చూసి ప్రజలు ఛీదరించుకుంటున్నారు. 

  రాజ్యాంగ విరుద్ధ పాలన..
  ప్రభుత్వ అవినీతిని, తప్పులను ఎత్తిచూపిన వారిపై అక్రమ కేసులు బనాయించడం, దోపిడీ సొమ్ముతో ప్రలోభాలతో ఎమ్మెల్యేలను కొనుగోళ్లు చేయడమే పనిగా పెట్టుకుంది. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా టీడీపీ పాలన సాగిస్తోంది. అధికారమే లక్ష్యంగా అమలు కాని హామీలతో ప్రజలను వంచించిన  చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ప్రజాకోర్టులో శిక్ష తప్పదని ప్రతిపక్ష నాయకులు హెచ్చరిస్తున్నారు. ప్రజలకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ అండగా నిలిచి వారి తరపున పోరాడుతున్న ఏకైక ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ కు రోజురోజుకు ప్రజాధారణ పెరుగుతోందని అంటున్నారు. 
Back to Top