సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘీభావం

హైదరాబాద్ :

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ నిరశన దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తూ కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తాను ఈ నెల 19 నుంచి విజయవాడలో ఆమరణ నిరాహార దీక్ష చేయాలని ఆమె నిర్ణయించారు. శ్రీమతి విజయమ్మ ఆమరణ దీక్షకు ‌సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం మద్దతు ప్రకటించింది. ఫోరం సభ్యులు శుక్రవారం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని నివాసంలో శ్రీమతి విజయమ్మ కలుసుకున్నారు.

అనంతరం ఫోరం చైర్మన్ డి.మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని‌ అడ్డగోలుగా విభజించాలని కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల సీమాంధ్ర ప్రాంతానికి తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులమంతా ఐక్యంగా పదిహేను రోజులుగా వివిధ రూపాల్లో ఉద్యమిస్తున్నామన్నారు. సచివాలయంలో తాము చేపట్టిన నిరసన కార్యక్రమానికి వైయస్ఆర్ కాంగ్రె‌స్ ఎం‌పి, ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపినందుకు శ్రీమతి విజయమ్మకు కృతజ్ఞతలు తెలిపామన్నారు. కేంద్రం విభజన నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు తమ కార్యక్రమాలకు వైయస్ఆర్‌ కాంగ్రెస్ మద్ద‌తు ఇవ్వాలని కోరామని, అందుకు ఆమె సానుకూలంగా స్పందించారని చెప్పారు.

ఈ సమావేశంలో పార్టీ నాయకులు డాక్టర్ ఎం‌.వి. మైసూరారెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కో-చైర్మన్ డి.మురళీమోహ‌న్, సి.హరీ‌ష్ కుమా‌ర్‌రెడ్డి, సమన్వయకర్త ఎ.రవీందర్‌రావు, కార్యదర్శి కె.వి. కృష్టయ్య, కన్వీనర్ టి.వెంకటసుబ్బయ్య, కో-కన్వీన‌ర్ బెన్సన్, హౌసింగ్ కో-ఆపరేటి‌వ్ సొసైటీ అధ్యక్షుడు వెంక‌ట్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top