శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్‌ ఆమోదం

నంద్యాల: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి నామినేషన్‌కు ఎన్నికల కమిషన్‌ ఆమోదం తెలిపింది. ఆర్డీవో నామినేషన్‌ పత్రాలను పరిశీలించిన అనంతరం శిల్పాకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. సోమవారం సాయంత్రానికి నామినేషన్ల పరిశీలన అంశం ముగిసింది. శిల్పా మోహన్‌ రెడ్డి నామినేషన్‌ చెల్లదంటూ అధికార పార్టీ ఉదయం నుంచి కుట్రలు చేసింది. ఈ మేరకు శిల్పా నామినేషన్‌ పత్రాలపై నోటరీ సంతకం చెల్లదని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అయితే వీటన్నింటిని పరిశీలించిన ఎన్నికల అధికారులు టీడీపీ ఫిర్యాదును తొసిపుచ్చారు. ఈ సందర్భంగా శిల్పా మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ..ఉదయం నుంచి కూడా టీడీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలు చేశారని మండిపడ్డారు. దేవుడి ఆశీస్సులు మాపై ఉన్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు. ముఖ్యమంత్రి దగ్గరుండి మరి ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దేవాలయాలు, మసీదులకు, చర్చీలకు డబ్బులు ఇస్తూ ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బూతు బూతుకు టీడీపీ మంత్రులను ఇన్‌చార్జులుగా నియమించారన్నారు. టీడీపీ చేస్తున్న ప్రతి అరాచకాలపై మా వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. నంద్యాలలో ఇప్పటికే 24 మంది ఎమ్మెల్యేలు, 12 మంది మంత్రులను నియమించారన్నారు. వీధులల్లో డబ్బులు పట్టుకొని మంత్రులు తిరుగుతున్నారని విమర్శించారు. నామినేషన్‌ ప్రక్రియపై ఇంకా రిటర్నింగ్‌ ఆఫీసర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.  

600 మంది వైయస్‌ఆర్‌సీపీలో చేరిక
నంద్యాలలో భూమా వర్గానికి షాక్‌. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మల్కిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో భూమా నాగిరెడ్డి వర్గానికి చెందిన 600 మంది కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ఇన్నాళ్లు భూమా వర్గంలో ఉన్న వీరంతా వైయస్‌ఆర్‌సీïపీలో చేరారు. ఇటీవల వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నంద్యాలలో ప్రకటించిన నవరత్నాలు పథకాలకు ఆకర్శితులమై పార్టీలో చేరినట్లు చెప్పారు. శిల్పా మోహన్‌ రెడ్డి విజయానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top