మీ బెదిరింపులకు భయపడేవాడిని కాదు

  • టీడీపీ విచ్చలవిడిగా డబ్బులు పంచుతోంది
  • కౌన్సిలర్లను, నాయకులను కొనుగోళ్లు చేస్తోంది
  • ఓటర్లకు డబ్బులు పంచుతూ ప్రలోభ పెడుతోంది
  • ఓటేయకపోతే మీకు పెన్షన్, రేషన్, ఇళ్లు రావంటూ బెదిరిస్తున్నారు
  • తన కుటుంబంపై వ్యక్తిగత దూషలు సరికాదు
  • ప్రభుత్వం మీది..ఏ విచారణ అయినా వేసుకోండి
  • తప్పుడు ఆరోపణలతో వ్యక్తిత్వం దెబ్బతీయడం సరికాదు
  • మీరు ఒకటి మాట్లాడితే నేను నాలుగు మాట్లాడతా
  • ప్రజలకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది
  • వైయస్సార్సీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ప్రెస్ మీట్

నంద్యాలః వ్యక్తిగత విమర్శలు చేస్తూ, తమ కుటుంబంపై దుష్ర్పచారం చేయడం తగదని వైయస్సార్సీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం మీది, మీరే అధికారంలో ఉన్నారు.  తాము ఏ చిన్న తప్పు చేశామని భావించినా నిరభ్యంతరంగా విచారణ చేసుకోవచ్చని సూచించారు. అంతేగానీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తూ వ్యక్తిత్వం దెబ్బతీయడం మంచిదికాదని అధికార టీడీపీకి హితవు పలికారు. ఏనాడు ఏ వ్యక్తిని కూడ తాము విమర్శించింది లేదన్నారు. నంద్యాలలోని పార్టీ కార్యాలయంలో తన కుటుంబసభ్యులతో కలిసి శిల్పా మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే....

తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి, మంత్రులను, నాయకులను ఏనాడు విమర్శించిన దాఖలాలు లేవు. శిల్పా సేవా సమితి, శిల్పా మహిళా సహకార్  మీద ఆరోపణలు చేశారు. శిల్పా మహిళా సహకార్ చట్టవ్యతిరేకంగా నడుస్తోంది, అనుమతి లేదు, చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. నిజం తెలుసుకొని మాట్లాడుతున్నాడా..? పక్కనోళ్లు చెబితే విని మాట్లాడుతున్నాడా అర్థం కావడం లేదు. తాము చట్టానికి వ్యతిరేకంగా ఏనాడు నడుచుకుంది లేదు. రిజిస్టర్ అయిన మహిళా సహకార్ మ్యాక్స్ పరిధిలో నడుస్తోంది.  శిల్పా సహకార్ పేదవాళ్లు, మధ్యతరగతి కుటుంబాలకు 10 నుంచి 12శాతం తక్కువకు సరుకులు అందించడం జరుగుతుంది. ముఖ్యమంత్రిని స్వాగతిస్తున్నాం. శిల్పా సహకార్, మహిళా సహకార్ చట్టవ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటే, అనుమతి లేకుండా కొనసాగిస్తుంటే ఎప్పుడైనా ఎంక్వైరీ చేసుకోండి. మూసేయడానికి సిద్ధం కండి. ఏ విచారణ అయినా వేసుకోండి. తాము సిద్ధం.  జిల్లా అధికారులు ఇప్పుటికే ఎలక్షన్ ముందు నుండి మూసేసేందుకు ఒత్తిడి తీసుకొచ్చారు.  ప్రజాస్వామ్యంలో ప్రజా సిద్ధాంతం ప్రకారం పదిమందికి మేలు జరగాలి, ఆదర్శంగా ఉండాలని రాజకీయాల్లోకి వచ్చిన వాడిని. టీడీపీ నా కుటుంబానికి వ్యతిరేకంగా చేస్తున్న పన్నాగాలు బాధపెడుతున్నాయి. నా పై ఈరోజువరకు చిన్న కేసు కూడ లేదు. భూమా నాగిరెడ్డి తమ మున్సిపాలిటి కౌన్సిలర్స్ పై దాడి చేసి, కొట్టిన పరిస్థితుల్లో మేము వారిపై కేసు పెట్టినప్పుడు... కోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చి వారు నాపై కేసు పెట్టారే తప్ప ఏ కేసు లేదు. మహిళా సహకార్ మీద ఏ మహిళ కూడ  ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. రేప్ చేసి అమ్మాయిని నదిలో పడవేస్తే కేసు పెట్టకుండా శిల్పా అడ్డుపడ్డాడని అఖిలప్రియ ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రి, అధికారులకు మనవి చేస్తున్నా. మేం ఏచిన్న తప్పు చేసినా విచారణ చేసుకోండి. అభ్యంతరం లేదు. ఫ్యాక్షన్ గ్రామాలు, తాలుకాలున్న ప్రాంతాల్లో కూడ ప్రశాంత వాతావరణంలో పదిమందితో కలిసి పనిచేశామే తప్ప అసాంఘిక, సంఘ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ప్రజలకు వ్యతిరేకంగా ఎప్పుడూ ఉండలేదు. 

టీడీపీ నంద్యాల ప్రజలను భయోత్పాతానికి గురిచేస్తోంది. అధికార బలంతో విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెడుతున్నారు. కౌన్సిలర్స్, నాయకులను కొనుగోలు చేసే కార్యక్రమం సాగుతోంది. పెద్ద ఎత్తున ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు.ముఖ్యమంత్రి మూడు సార్లు నంద్యాలకు వచ్చారు. వచ్చినప్పుడల్లా రెండ్రోజులుంటూ మొత్తంగా 29 కౌన్సిలర్స్ ను మేం గెలుచుకుంటే 13 మందిని వివిధ ప్రలోభాలతో డబ్బులతో కొనుగోలు చేశాడు.  నాయకులను, కౌన్సిలర్స్ ను తీసుకున్నారు. నా బంధువులు, కార్యకర్తల మీద, అనుచరుల మీద అర్థరాత్రి పోలీసులతో దాడులు చేస్తున్నారు. అధికారులతో బెదిరిస్తున్నారు. పెన్షన్, రేషన్ కట్ అవుతుందని బెదిరిస్తున్నారు. వైయస్ఆర్ నగర్, అయలూర్ మెట్ట దగ్గర ఓటు వేయకపోతే పట్టాలు క్యాన్సల్ అవుతాయని బెదిరిస్తున్నారు. ఆటోనగర్ వాసులకు వాళ్ల సొంత భూమి రిజస్టర్ చేయడం లేదు. టీడీపీకి ఓటేయకపోతే రిజిస్టర్ చేయమని బెదిరిస్తున్నారు. పొదుపుసంఘాల మహిళల ఫోన్ నంబర్ లున్నాయి. ఓటేయకపోతే తెలిసిపోతుందని సీఆర్పీల ద్వారా బెదిరిస్తున్నారు. ట్రాక్టర్లు, కుట్టుమిషన్ ల ట్రైనింగ్ పేరుతో పంపిణీ చేసేందుకు సిద్ధపడ్డారు. విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. దేవాలయాలు, మసీదులు, శ్మశానాలకు డబ్బులిస్తున్నారు. చిన్నస్థాయి నుంచి పెద్దస్థాయి నాయకుని వరకు కొనుగోళ్లు చేస్తున్నారు.  ఎలక్షన్స్ రెండ్రోజుల ముందు వైయస్సార్సీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంతవరకు ఎవరూ శిల్పా కుటుంబాన్ని ఏమీ చేయలేరు. వైయస్ జగన్ నంద్యాలకు వచ్చాక 12రోజుల పర్యటనలో ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు.  పల్లెల్లో పర్యటిస్తున్న సందర్భంగా ఎన్నో కష్టాలు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను చూశారు. ప్రజలు తమ ఇబ్బందులను వివరించారు. వైయస్ జగన్ ప్రచారం సందర్భంగా ప్రజాస్పందన అద్భుతంగా వచ్చింది. ప్రతి ఒక్కరూ వైయస్ జగన్ తో కరచాలనం చేసేందుకు, మాట్లాడేందుకు , సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. రోజురోజుకు మూడు, మూడునన్నర కిలోమీటర్లు ప్రయాణించేందుకు 11గంటల సమయం పడుతోంది.  ఎంతో మందిని కలిశాం . వైయస్సార్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నదుకు ప్రత్యేక కృతజ్ఞతలు. జగన్ కు మా కుటుంబం తరపున ప్రత్యేక ధన్యవాదములు. పీవీ నరసింహరావును ప్రధానిగా పంపిన నియోజకవర్గం నంద్యాల. ఇలాంటి నియోజకవర్గంలో ప్రజలు జాగ్రత్తగా ఆలోచించాలి. 

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో ఎందుకు అభివృద్ధి చేయలేదు. ? అభివృద్ధి చేయకుండా ఆయనకు ఎవరు అడ్డుపడ్డారు. అభివృద్ధి చేయాలని తాను చంద్రబాబుకు ఎన్ని వినతులు ఇచ్చినా స్పందించిన దాఖలాలు లేవు. ఈరోజు మాట్లాడుతున్నారు. అభివృద్ధి అంటే రోడ్లు డెవలప్ చేస్తేనే అభివృద్ధి అని ప్రజలు నమ్మడం లేదు. కడప నుంచి కర్నూలు వరకు వైయస్ఆర్ హయాంలో హైవే డెవలప్ మెంట్ మొదలుపెట్టారు. ఎక్కడైనా అబివృద్ధి ఆగిందా..? పెన్షన్లు, పట్టాలు, రేషన్ ల విషయంలో ప్రజలకు అన్యాయం జరగకుండా కోర్టుకువెళ్లైనా తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రజలు భయపడొద్దు. రూ.1200కోట్లు ఇచ్చామని ముఖ్యమంత్రి చెబుతున్నాడు. భూమా బ్రహ్మానందరెడ్డి మాటలు చూస్తే నేను ఎమ్మెల్యేగా ఎన్నికైతే...  3 సెంట్ల స్థలం, పదివేల అపార్ట్ మెంట్లు కట్టిస్తామని చెబుతున్నారు. మొత్తం 6లక్షలు ఇస్తామంటున్నారు. ఇందులో లక్షన్నర కేంద్రం, లక్షన్నర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట. మిగిలిన మూడు లక్షలు ప్రజల నెత్తిన వేస్తారట.  నెలకు రూ.  3వేల చొప్పున 20ఏళ్లు ప్రజలు మిగిలిన సొమ్ము కట్టాలట. ప్రభుత్వం ఉచితంగా ఇళ్లు కట్టాల్సిందిపోయి ప్రజలపై భారం రుద్దుతోంది . పచ్చదనం పరిశుభ్రత అన్నాడు ఎక్కడుంది. సీటీ అంతా సీసీ కెమరాలు, విద్యార్థులకు ఉచిత వైఫై అన్నాడు. నోటికొచ్చినవి మాట్లాడారు. ఏదీ నెరవేర్చలేదు. 

ఎన్నికలకు ముందు నేను ఒకే వాగ్ధానం చేశాను. సిటీ కేబుల్ రేట్లు తగ్గించి తీసుకొస్తానని చెప్పాను. ఓడిపోయినా కూడ 260 నుంచి 350కు పెంచే క్రమంలో సిటీ కేబుల్ ఉన్నప్పుడు శిల్పా కేబుల్ తెచ్చి 130కే అందించి మాట నిలబెట్టుకున్నాం. ఓ వ్యక్తి గురించి వ్యతిరేకంగా మాట్లాడడమో, చెడుగా చిత్రీకరించడమో ఏనాడు మేం చేయలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను ఓట్లు అడుగుతున్నాం. అనని మాటలను అన్నట్టుగా చిత్రీకరిస్తూ, తమపై దుష్ర్పచారం చేస్తున్నారు. ప్రభుత్వం మీది, మీరే అధికారంలో ఉన్నారు. ఎప్పుడైనా విచారణ చేసుకోవచ్చు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తూ వ్యక్తిత్వం దెబ్బతీయడం మంచిదికాదు. చిన్నపిల్లలు అనాథలైనారు ఆదరించండి అని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. బ్రహ్మానందరెడ్డి తల్లి బతికే ఉంది. వాళ్ల నాన్న గుండెపోటుతో చనిపోయారు.అఖిలప్రియ 30ఏళ్లుంటాయి అనాథలంటున్నారు. వాళ్ల వల్ల కొన్ని వందల కుటుంబాలు అనాథలయ్యారు. వాళ్ల మనోవేధన గురించి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడరు. వందకోట్ల వైశ్యులకు సంబంధిచిన ఆస్తులు ఎవరు కాజేశారో.. నడిబజారులో వైశ్య ప్రముఖుడని రాడ్లు, కట్టెలతో ఎవరు కొట్టారో... ముస్లిం ప్రముఖుడిని నడిబజారులో కొట్టుకుంటూ పోయింది ఎవరో ప్రజలకు తెలుసు. చేసేవన్నీ మీరు చేస్తూ మాపై ఆరోపణలు చేస్తారా..?మీరు ఒకటి మాట్లాడితే నేను నాలుగు మాట్లాడతా. బెదిరించాలని చూస్తే భయపడేవాన్ని కాదు. 28 రోజులుగా మలేరియా జ్వరం నన్ను ఇబ్బంది పెట్టింది. మీడియాకు ఇంటర్వూలు ఇవ్వలేకపోయా. మన్నించాలి. జ్వరం కారణంగా పూర్తి స్థాయిలో ప్రజలతో మమేకం కాలేకపోయా. నా అనారోగ్యానికి మన్నించాలని కోరుతున్నా. 

తాజా వీడియోలు

Back to Top