శిల్పా చక్రపాణిరెడ్డిపై హత్యాయత్నం

నంద్యాల: తెలుగుదేశం పార్టీ హత్యా రాజకీయాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డిపై భూమా వర్గీయులు కాల్పులు జరిపారు. మైనార్టీ నేత చింపింగ్‌ అంత్యక్రియలకు వచ్చిన శిల్పా చక్రపాణిరెడ్డిపై సూరజ్‌ గ్రాండ్‌ హోటల్‌ వద్ద భూమా వర్గీయుడు అభిరుచి మధు 5 రౌండ్ల కాల్పులు జరిపాడు. చక్రపాణిరెడ్డి లక్ష్యంగా మధు కాల్పులు జరపడంతో ఆయన తృటితో తప్పించుకున్నారు. దీంతో భూమా వర్గీయులను శిల్పా వర్గీయులు అడ్డుకున్నారు.

వేటకొడవళ్లతో చంపుతామంటూ బెదిరించారు
చంపుతాం.. అంటూ టీడీపీ నేతలు తనను, తన అనుచరులను బెదిరించారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి చెప్పారు. నంద్యాలలో తనపై జరిగిన హత్యాయాత్నానికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. కౌన్సిలర్‌ భర్త చింపింగ్‌ చనిపోవడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు తన అనుచరులు, కౌన్సిలర్లు, నాయకులతో కలిసి వెళ్లామన్నారు. పరామర్శించి తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరుతున్న సమయంలో కొందరు కావాలనే కారు అడ్డుపెట్టారని శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. వాహనాలు సైడ్‌ పెట్టుకోండి మేం వెళ్లిపోతామని చెబితే.. మీరే వెనక్కు వెళ్లండి అంటూ టీడీపీ నేతలు దర్భాషలాడుతూ కత్తులు తీశారన్నారు. మమ్మల్ని చంపుతాం అని కత్తులు పట్టుకొని వచ్చారన్నారు. తరువాత గొడవ సర్ధుమనగడంతో ఇంటికి వెళ్లడానికి కారు వెనక్కు తీస్తుండగా కొందరు వ్యక్తులు 5 రౌండ్లు కాల్పులు జరిపారన్నారు. గొడవపై సీఐగా ముందుగా సమాచారం తెలియజేసినా కావాలనే ఆలస్యంగా వచ్చారన్నారు. గొడవ ఉద్రిక్తం కావడంతో పోలీసులు వచ్చి అడ్డుకున్నారన్నారు. టీడీపీ నేతలు వేట కొడవళ్లు కూడా పట్టుకొని చంపుతామంటూ బెదిరించారన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top