చంద్రబాబు ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తున్నాడుకర్నూలు: ప్రతిపక్షాన్ని తిట్టడం మానేసి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు దృష్టి పెట్టాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నంద్యాల పార్లమెంట్‌ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి సూచించారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముచ్చుమ్రరి ప్రాజెక్టు పైపులు తీసుకెళ్లి పట్టిసీమకు బిగించారని, ముచ్చుమ్రరికి కనీసం నాలుగు రోజులు కూడా నీరు ఇవ్వలేదన్నారు. తన పబ్లిసిటీ కోసం చంద్రబాబు ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తున్నాడని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోకుండా అన్యాయం చేస్తున్నాడన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌కల్యాణ్‌ నటిస్తున్నారు. పోలవరం, కాపుల రిజర్వేషన్‌ అంశాలను పక్కదారి పట్టించేందుకు మళ్లీ చంద్రబాబు పవన్‌ను తెరపైకి తీసుకువచ్చారన్నారు. ఎవరిన్ని కుట్రలు పన్నీనా ప్రజలంతా వైయస్‌ జగన్‌ వెంటే నడుస్తున్నారన్నారు. 
Back to Top