సిఎంకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ నిరసన సెగ

నెల్లూరు‌, 3 ఏప్రిల్‌ 2013: ముఖ్యమంత్రి కిరణ్కుమా‌ర్‌రెడ్డికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నిరసనల సెగ తగిలింది. సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి నెల్లూరులో బస చేసిన అతిథిగృహం వద్ద వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ శ్రేణులు బుధవారం ఆందోళన‌ చేశాయి. విద్యుత్ ఛార్జీ‌లు తగ్గించాలంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పార్టీ‌ నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Back to Top