సిఎంకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సవాల్‌

హైదరాబాద్, 25 మార్చి 2013: విద్యుత్ కోతల కారణంగా రాష్ట్రంలో ఒక్క ఎకరం‌ పంట కూడా ఎండిపోలేదని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడడం దారుణమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తంచేశారు. సిఎం కిరణ్ సొంత నియోజకవర్గం పీలేరులోనే ఎండిపోయిన పంటలు చూపించడానికి తాము సిద్ధం‌ అని వారు అన్నారు. అందుకు సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సిద్ధమేనా అంటూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు సవాల్ చేశారు.

రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్నది గుడ్డి ప్రభుత్వం అని ప్రజలందరికీ తెలిసిందని పార్టీ ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. విద్యుత్ రంగానికి తగ్గిపోతున్న సబ్సిడీలను గణాంకాలతో సహా వారు పట్టిక రూపంలో సోమవారంనాడు హైదరాబాద్‌లో మీడియా ఎదుట వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ప్రదర్శించారు.
Back to Top