సిఎం కిరణ్‌కు చంద్రబాబే ఆదర్శం

వడ్లమన్నారు (కృష్ణాజిల్లా), 4 ఏప్రిల్‌ 2013: ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడే ఆదర్శం అని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వారిద్దూ మంచి మిత్రులని ఆమె పేర్కొన్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల గురువారం వడ్లమన్నారులో స్థానికులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కు ఇప్పుడు చంద్రబాబు సలహాదారునిగా వ్యవహరిస్తున్నారని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ఎనిమిదేళ్ళలో ఎనిమిదిసార్లు కరెంట్ ‌ఛార్జీలు పెంచారని, కిరణ్‌రెడ్డి ఇప్పటికే నాలుగు సార్లు పెంచారని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరుపేదల ఇళ్లల్లో కూడా కరెంట్ బిల్లులు మూడింతలు పెరిగాయని ఆమె ‌ఆవేదన వ్యక్తంచేశారు. కరెంట్ కోతలతో రైతులు, పరిశ్రమల యజమానులు ‌అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విచారం వ్యక్తంచేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టించి ఇస్తారని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు. రాజన్న రాజ్యం తీసుకువచ్చి జగనన్న ప్రజా పాలన చేస్తారని ఆమె భరోసా ఇచ్చారు. ఎస్‌సి కాలనీల్లో మరుగుదొడ్లు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైనాన్ని శ్రీమతి షర్మిల ప్రస్తావించారు.

మహానేత, దివంగత ముఖ్యమంత్రి ‌వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదల ఇళ్ల నిర్మాణం కోసం 32 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇస్తే, ఆ స్థలంలో ఇప్పటివరకూ ఈ ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇవ్వలేదని శ్రీమతి షర్మిల విమర్శించారు. ఎస్సీ కాలనీలో పావల వడ్డీ రుణాలు ఇవ్వడం లేదని ఈ సందర్భంగా మహిళలు శ్రీమతి షర్మిలకు ఫిర్యాదు చేశారు. జగనన్న సిఎం అయితే మహిళలు, రైతులకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని ఆమె భరోసా ఇచ్చారు.
Back to Top