సిద్ధారెడ్డి సంతాపం

తనకల్లు: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తొట్టివారిపల్లికి చెందిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు ఆదినారాయణరెడ్డి (70) శుక్రవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సిద్ధారెడ్డి గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులు లక్ష్మీనర్సురెడ్డి, చంద్రారెడ్డి, నరసింహారెడ్డికి ధైర్యం చెప్పి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదినారాయణరెడ్డి మృతి పార్టీకి తీరని లోటన్నారు. అనంతరం పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. ఆయన వెంట సీఆర్‌ పల్లి సర్పంచ్‌ చాంద్‌బాషా, మాజీ సర్పంచ్‌ ఆనంద్‌రెడ్డి, నాయకులు శ్రీధర్‌రెడ్డి, లక్ష్మీరంగారెడ్డి, వనం శ్రీనివాసారెడ్డి, క్రిష్ణారెడ్డి తదితరులున్నారు.

Back to Top