పేదలను ఆదుకోండి

నెల్లూరు:  వైయ‌స్సార్‌ న‌గ‌ర్‌లో నాసిర‌కంగా నిర్మించిన ఇళ్ల‌ను తొల‌గించి వాటి స్థానంలో కొత్త ఇళ్లు క‌ట్టించడంతో పాటు, సాలుచింతల ప్రాంతంలోని పెన్నా బ్యారేజ్ వద్ద ప్రహారి గోడ నిర్మించేలా చర్యలు తీసుకోవాలని  నెల్లూరు న‌గ‌ర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాద‌వ్ క‌లెక్ట‌ర్ రేపు ముత్యాల‌రాజును క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ... నిరుపేద‌ల సొంతింటి క‌ల నెర‌వేర్చేందుకు దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి 6,500 ఇళ్లు నిర్మాణానికి ప్ర‌ణాళిక‌లు రూపొందించార‌న్నారు. ఆ త‌ర్వాత అధికారం చేప‌ట్టిన పాల‌కులు వైయ‌స్సార్‌ న‌గ‌ర్‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ప‌నులు నాసిర‌కంగా జ‌రిగాయ‌ని అనిల్ వివ‌రించారు. గ‌తంలో చంద్ర‌బాబు, మంత్రి నారాయ‌ణ ఈ ప్రాంతంలో ప‌ర్య‌టించి కొత్త ఇళ్లు నిర్మిస్తామ‌ని హామీ ఇచ్చి మ‌ర‌చిపోయార‌ని ఆయ‌న ఆరోపించారు. 

సాలుచింత‌ల ప్రాంతంలో పెన్నాబ్యారేజీ నిర్మాణంతో నిర్వాసితుల‌వుతున్న పేద‌ల‌ను ఆదుకోవాల‌ని కోరారు. అక్క‌డ బండ్‌కు బ‌దులు ప్ర‌హ‌రీ గోడ నిర్మాణం లేదా ప్ర‌త్యామ్నాయం చూడాల‌ని క‌లెక్ట‌ర్‌ను కోరాన‌ని ఆయ‌న తెలిపారు. ఎమ్మెల్యే వెంట డిప్యూటీ మేయ‌ర్ ముక్కాల ద్వార‌కానాథ్‌, వైయ‌స్సార్‌సీపీ ఫ్లోర్ లీడ‌ర్ పి. రూప్‌కుమార్‌యాద‌వ్‌, వైయ‌స్సార్‌సీపీ జిల్లా అధికార ప్ర‌తినిధి ఎస్ఆర్ ఇంతియాజ్‌, నాయ‌కులు మ‌హేష్‌, రంగా త‌దిత‌రులున్నారు. 

తాజా ఫోటోలు

Back to Top