నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

గుంటూరు:  గతంలో ఎన్నడూ లేనంతగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రైతాంగం తీవ్ర మాన‌సిక ఆందోళ‌న‌ను ఎదుర్కొంటోందని వైయస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. గుంటూరులో మీడియా సమావేశంలో మాట్లాడారు. నీరు-చెట్టు కార్య‌క్ర‌మంలో భాగంగా చెరువు ఆయ‌క‌ట్టు వ‌ద్ద మ‌ట్టిని త‌వ్వడంతో, వ‌ర‌ద తాకిడిని తట్టుకోలేక తెగిపోయాయ‌ని, దీంతో పంట‌లు నీట మునిగి తీవ్ర న‌ష్ట వాటిల్లింద‌ని  లేళ్ల అప్పిరెడ్డి అన్నారు.  వ‌ర్షాల తాకిడికి పూర్తిస్థాయిలో పొలాలు కొట్టుకుపోయిన దుస్థితి నెల‌కొంద‌న్నారు. 

పంట చేతికచ్చే స‌మ‌యంలో రైతులు పూర్తిస్థాయిలో న‌ష్ట‌పోయార‌ని, ఎక‌రాకు సుమారు రూ. 15 వేలు న‌ష్ట‌పోయార‌న్నారు. అంతేకాకుండా వ‌ర‌ద‌ల తాకిడికి పంట‌పొలాల్లో కురుకుపోయిన ఇసుకను తొల‌గించుకునేందుకు రైతులు ఆద‌నంగా న‌ష్ట‌పోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్నారు.  రైతులకు అండ‌గా నిల‌బ‌డాల్సిన అధికార స‌ర్కార్ నిమ్మ‌కునీరెత్తిన‌ట్లు ఉంద‌ని దుయ్యబట్టారు. రాజ‌కీయాల‌కు తావివ్వ‌కుండా ప్ర‌తి రైతును ఆదుకోవాల‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. 

Back to Top