మోసకారి బాబును నిలదీయండి

  • అబద్ధపు హామీలిచ్చి మోసం చేస్తే రాజకీయవ్యవస్థ దిగజారిపోతుంది
  • ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చకపోతే ప్రజలు నిలదీస్తారన్న భయం పుట్టాలి
  • అప్పుడే రాజకీయ వ్యవస్థలో, నాయకుల్లో మార్పు వస్తుంది
  • బాబు ఏ ఒక్కరినీ వదిలిపెట్టలేదు..అందరినీ మోసం చేశాడు
  • బాబు వంచనను నిలదీసేందుకే గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం
  • మునగపాక బహిరంగసభలో వైయస్ జగన్

విశాఖపట్నం(మునగపాక): మోసపూరిత పాలన సాగిస్తున్న చంద్రబాబును ఎక్కడిక్కడ నిలదీయాలని ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునగపాకలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వైయస్ జగన్ ఏమన్నారంటే....

  • బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. 
  • రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు.
  • ఆఖరికి చిన్నపిల్లలను కూడా వదల్లేదు. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. 
  • బాబు ఐతే ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా అబద్ధపు హామీలిచ్చి అందరినీ మోసం చేశాడు.
  • బాబు అవినీతి, మోసాలను ఎండగట్టేందుకే గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టాం. 
  • ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రజలను మోసం చేస్తే ఏం చేయాలి అని అడుగుతున్నా.
  • ముఖ్యమంత్రిని కదా ఏమైనా చేయొచ్చు, ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు అంటే రాజకీయ వ్యవస్థ దిగజారిపోతుంది. మనలో చైతన్యం రావాలి. 
  • ఏ నాయకుడైనా పలానా చేస్తానని మాట ఇచ్చి అది చేయకపోతే... ప్రజలు నిలదీస్తారన్న భయం పుట్టాలి. 
  • రాజకీయ వ్యవస్థ బాగుపడాలన్నా, నాయకుల్లో మార్పు రావాలన్నా మనమంతా ఒక్కటవ్వాలి. 
  • ఆ రోజు ఏం చెప్పావు, ఎన్నికలయిపోయాక  ఏం చేస్తున్నావు బాబు. మోసం చేయడం నీకు తగునా అని నిలదీయాలి.
  • అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. నాయకుల్లో మార్పు వస్తుంది. 
  • యలమంచిలి నియోజకవర్గ కోఆర్డినేటర్లు అయిన నాగేశ్వరరావు, ప్రసాద్ లను ఆదరించండి. 
  • బాబు పాలనలో జరుగుతున్న మోసాలను నిలదీయండి. వైయస్సార్సీపీని ఆశీర్వదించండి.
  • వారిద్దరికి ఒకటే చెబుతున్నా.... ప్రజల దగ్గరకు వెళ్లి వారి బాధల్లో పాలుపంచుకొని, తోడుగా ఉన్నామని భరోసా కల్పించండి. 
  • బాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించి ...ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడా లేదా అన్నది వారినే అడగండి. మార్కులు వేయించండి.  సంఘీభావం తెలుపుతూ తోడుగా నిలవండి.
  • ఈసందర్భంగా వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధ్యక్షులు వైయస్ జగన్ స్వయంగా పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. 

Back to Top