ఆస్పత్రుల్లో సదుపాయాలు మెరుగుపర్చాలి

తూర్పుగోదావరిఃఅచ్యుతాపురం(కపిలేశ్వరపురం):మండలంలోని ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు సదుపాయాలను పెంచాలని వైయస్సార్‌ సీపీ నాయకులు పలివెల మధు అధికారులను కోరారు. అచ్యుతాపురంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుందని, జిల్లాలోనే అతి పెద్ద పీహెచ్‌సీగా ఉన్న అంగర పీహెచ్‌సీని విభజించి ఐదు పీహెచ్‌సీలుగా విభజించారన్నారు. ఆయా పీహెచ్‌సీలలో సదుపాయాలు లేమితో విభజన లక్ష్యం నెరవేరలేదన్నారు. అంగర మినహా మిగిలిన పీహెచ్‌సీలలో ల్యాబ్‌ అసిస్టెంట్లు లేక రక్త పరీక్షలు చేయించుకునేందుకు రోగులు ప్రైవేటు ల్యాబరేటరీలను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. పడక గదులు, సిబ్బంది, భవనాల్లో సౌకర్యాలు లేమి తదితర సమస్యలు ఆరోగ్య కేంద్రాలను పట్టిపీyì స్తున్నాయని, ఉన్నతాధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని మధు కోరారు. 
Back to Top