పేద‌ల‌ను, అనాధ‌ల‌ను ఆదుకోవాలి

నెల్లూరు జిల్లా))నెల్లూరు జిల్లా ప‌రిధిలో ప్ర‌గ‌తి ఛారిటీస్ లో మాన‌సిక విక‌లాంగుల
ఫిజియోథెర‌పి సెంట‌ర్ ను నెల్లూరు రూర‌ల్ వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి
శ్రీధ‌ర్ రెడ్డి ప్రారంభించారు. స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ పేద‌ల‌కు, అనాధ‌ల‌కు మ‌నం అండ‌గా నిల‌బ‌డితే భ‌గ‌వంతుడు
మ‌న‌కు అండ‌గా ఉంటాడ‌ని,
మాన‌వసేవే మాధ‌వ
సేవ‌ని  అన్నారు. మ‌నం నిర్వ‌హించే జ‌న్మ‌దినాలు, వివాహాలు, వార్షికోత్స‌వాలు.. ఇలాంటి స‌మ‌యాల‌లో పేద‌ల‌కు, అనాధ‌ల‌కు అండ‌గా ఉండేందుకు కొంత మొత్తాన్ని
కేటాయించాల‌ని ఆయ‌న అన్నారు. ఈ సెంటర్ కోసం రూ.5 ల‌క్ష‌ల రూపాయ‌లు విరాళం అందించిన చిన్నారి
కీర్తిని ఆయ‌న అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్సీపీ న‌గ‌ర అధ్య‌క్షులు
తాటి వెంక‌టేశ్వ‌ర రావు,
ఛారిటీస్ నిర్వ‌హ‌కులు
సుశీల‌మ్మ‌,
శిరీష్ త‌దిత‌రులు
పాల్గొన్నారు.

 

Back to Top