విజయమే లక్ష్యంగా కృషి చేయాలి

ఒంగోలు: ఎన్నికలు ఎప్పుడు జరిగినా జిల్లాలోని 12 అసెంబ్లీ, 3 పార్లమెంట్‌ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  ఒంగోలులోని సీతారామ ఫంక్షన్‌ హాలులో జరిగిన జిల్లా ప్లీనరీకి అధ్యక్షత వహించిన బాలినేని వేలాదిగా తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్లీనరీలో తీర్మానం చేసిన పలు ప్రధాన సమస్యలను ఆయన ప్రస్తావించారు.

Back to Top