గోపాల్ రెడ్డి గెలుపునకు కృషి

కర్నూలు: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న వెన్నపూస గోపాలరెడ్డి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి పార్టీ నాయకులను కోరారు. గురువారం తుగ్గలిలో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో బాబు వస్తే జాబు వస్తుందని హామీ ఇచ్చి నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేశారని విమర్శించారు. ప్రత్యేక హాదా కోసం పోరాడాల్సిన బాబు హోదాను గాలికొదిలి ప్రత్యేక ప్యాకేజీకి పాకులాడడం సిగ్గు చేటన్నారు. విద్యార్థుల కోసం దివంగత వైయస్‌ఆర్‌ ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెడితే ప్రస్తుత ప్రభుత్వం  పథకాన్ని నీరుగార్చుతోందన్నారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. మార్చి 16న జరిగే పోలింగ్‌లో పట్టభద్రులు అధికంగా పాల్గొనేలా చూసి ఎమ్మెల్సీ విజయానికి కృషి చేయాలన్నారు.  అనంతరం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గోపాలరెడ్డి స్థానిక వివేకానంద పాఠశాల, అనసూయ విద్యా సంస్థల్లో పట్ట భద్రుల ఓటర్లను కలిసి తనకు మొదటి ప్రాధ్యాన్యతా ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే మండలిలో నిరుద్యోగ యువత సమస్యలపై గళం విప్పి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందు కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ పార్టీ నాయకులు ప్రతాపరెడ్డి, రమణారెడ్డి, రామచంద్రారెడ్డి, ప్రహ్లాదరెడ్డి, జిట్టా నాగేష్, పురుషోత్తం, గంగాధర, హనుమంతరెడ్డి పాల్గొన్నారు.

Back to Top