రైతులను ఆదుకోవాలి

()రైతుల పొలాలు కొట్టుకుపోయినా కేసీఆర్ కు పట్టడం లేదు
()ఫాంహౌజ్ ల చుట్టూ తిరుగుతూ తన పొలాలను రక్షించుకుంటున్నాడు
()జిల్లాలపై ఉన్న మోజు రైతులపై లేకపోవడం బాధాకరం

వరంగల్‌: అకాల వర్షాలతో పంట నష్టపోయిన బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోని పంట నష్టపరిహారం చెల్లించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. వరంగల్‌ జిల్లాలో భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆయన గురువారం పరామర్శించారు. అంతకుముందు జిల్లా పర్యటనకు వచ్చిన వైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డిలకు కార్యకర్తలు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. 

పంటలను పరిశీలించిన అనంతరం గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్‌కు కొత్త జిల్లాలపై ఉన్న మోజు పేద రైతులపై లేదని మండిపడ్డారు. పరిపాలనను గాలికొదిలేసి బంగారు తెలంగాణ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలకు రాష్ట్రంలో వందల ఎకరాల పంట కొట్టుకుపోతే రైతులకు అండగా నిలవాల్సిందిపోయి ఫాంహౌజ్‌ల చుట్టూ తిరుగుతూ తన పంట పొలాలను రక్షించుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కేసీఆర్‌ బాధిత రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. 
 
Back to Top