వైయస్ఆర్‌కుటుంబం విజయవంతం చేయాలి

సదుం: వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమ వినజయవంతానికి అందరూ కృషి చేయాలని జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి సోమవారం పేర్కొన్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గస్థాయి బూత్‌ కమిటీ కన్వీనర్లకు స్థానిక సుబ్రమణ్యస్వామి ఆలయంలో మంగళవారం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. నవరత్నాల కార్యక్రమం విజయవంతం చేయడంలో బూత్‌కమిటీలే కీలకమన్నారు. కమిటీ సభ్యులు నిత్యం గ్రామాలలో తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేయడంతో పాటు, వైయస్‌ఆర్‌సీపీ ఆధికారంలోకి వస్తే కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. ప్రజలు తమ సమస్యలను తెలిపేందుకు ప్రతికుటుంబం నుంచి 9121091210 నెంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం రాగానే ఆసమస్యలు తీర్చేందుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఉదయం 9గంటలకు జరగే శిక్షణకు బూతకమిటీ కన్వీనర్లు అందరూ హాజరుకావాలని కోరారు.

Back to Top