``ప్ర‌జా సంక‌ల్పం`` విజ‌య‌వంతం కావాల‌ని కోరుతూ పాద‌యాత్ర‌

వేమూరు (మంగ‌ళ‌గిరి):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి న‌వంబ‌ర్ 6వ‌తేదీ నుంచి చేప‌ట్ట‌నున్న ``ప్ర‌జా సంక‌ల్పం`` పాద‌యాత్ర  విజ‌య‌వంతం కావాల‌ని కోరుతూ వేమూరు, తెనాలి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు మేరుగ నాగార్జున‌, అన్నాబ‌త్తుని పాద‌యాత్ర నిర్వ‌హించ‌నున్న‌ట్లు మండ‌ల పార్టీ అధ్య‌క్షులు బొల్లిముంత ఏడు కొండ‌లు మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.  న‌వంబ‌ర్  4 వ తేదిన మేరుగ నాగార్జున, అన్నాబత్తుని శివకుమార్‌ తెనాలి వైకుంఠ దేవస్ధానం నుంచి విజయవాడ కనకదుర్గ, గుణదల మేరీ మాత గుడి వద్దకు పాదయాత్ర నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ పాద యాత్ర విజయవంతం చేసేందుకు వేమూరు నియోజక వర్గంలోని వేమూరు, కొల్లూరు, భట్టి ప్రోలు,అమర్తలూరు, చుండూరు మండలాలు నుంచి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో తరలి వచ్చి పాదయాత్ర విజయవంత చేయాలని ఆయన కోరారు.

Back to Top