అక్రమ కట్టడాలని నిలిపివేయాలి

విశాఖ:  మునగపాక మండలంలోని పల్లపు ఆనందపురం గ్రామంలో గెడ్డపోరంబోకు స్థలంలో అక్రమ కట్టడాలను నిలుపదల చేయాలని కోరుతూ శనివారం తహశీల్దార్‌ రాంబాబు దృష్టికి పల్లపు ఆనందపురం వైయస్‌ఆర్‌సీపీ నేతలు తీసుకువచ్చారు. గ్రామంలో గెడ్డపోరంబోకు స్థలంలో కొంతమంది పక్కా ఇళ్లపేరిట అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారని అధికారులు స్పందించి పనులను నిలుపుదల చేయాలని కోరారు. పంచాయతీ పరమైన  కార్యకలాపాలు చేపట్టేందుకు అనువుగా సంబందిత స్థలాన్ని పరిశీలిస్తుంటే అదేస్థలంలో కొంతమంది అక్రమకట్టడాలకు పాల్పడుతున్నారన్నారు. తక్షణమే పనులను ఆపించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఇందుకు స్పందించిన తహశీల్దార్‌ రాంబాబు మాట్లాడుతూ గెడ్డపోరంబోకు స్థలాన్ని కాపాడాల్సిన అధికారం నీటిపారుదల శాఖ అధికారులకు ఉందన్నారు.  ఈవిషయాన్ని ఆర్‌డీవో పద్మావతి దృష్టికి తీసుకువెళతానన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో అల్లవరపు రమణబాబు, క్రరి పెదబ్బాయి తదితరులున్నారు.

Back to Top