అక్ర‌మ రోడ్డు నిర్మాణ ప‌నులు నిలిపివేయాలి

 గుంటూరు(చిలకలూరిపేట) : మున్సిపల్ కమిషనర్‌ నామా కనకారావు తన ఉద్యోగానికి రాజీనామ చేసి టీడీపీలో చేరితే బాగుంటుందని మునిసిప‌ల్ వైయ‌స్ఆర్‌సీపీ  ఉపప్రతిపక్ష నాయకుడు షేక్‌ అబ్దుల్‌  సూచించారు..పట్టణంలోని 9వ వార్డులో గల మసీదు స్ధలంలో అధికార పార్టీ నాయకులు చేపడుతున్న అక్రమ రోడ్డు నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు సోమవారం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ గంజి చెంచుకుమారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రార్ధనా స్థలాన్ని కాజేసే వారిపై చర్యలు తీసుకోవాని కమిషనర్‌ను కోరితే మతోన్మాదిలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అధికార పార్టీ నాయకుల దుశ్చర్యలను ప్రోత్సహిస్తూ ముస్లిం మతస్తుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఛైర్‌పర్సన్‌కు చెప్పి రౌఫ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.టిడిపి కార్యకర్తలా వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దని సూచిస్తే...తాను టిడిపి కార్యకర్తనేనని,చేతనైతే కోర్టులకెళ్ళి తేల్చుకోవాలని నిస్సిగ్గుగా చెప్పడం దివాళాకోరు పరిపాలనకు నిదర్శనమన్నారు.కార్యాలయంలో పనిచేసే మున్సిపల్‌ డీఈ,ఎఈ,పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు సైతం.. జరుగుతున్న రోడ్డు నిర్మాణం అక్రమమని తేల్చి చెబుతుంటే కమిషనర్‌ తమ మతస్థులపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.చిలకలూరిపేట ప్రజల పట్ల గతంలో కమీషనర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకొచ్చారు.ఈ వ్యవహారాన్ని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేలా కృషి చేస్తానని హామీనిచ్చారు.

Back to Top