ఆర్టీసీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

విజ‌య‌వాడ‌: ఆర్టీసీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ మేర‌కు శ‌నివారం విజ‌య‌వాడ‌లో ఆర్టీసీ ఎండీకి వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు విన‌తిప‌త్రం అంద‌జేశారు. నూత‌న బ‌స్సు స‌ర్వీసులు ఏర్పాటు చేయాల‌ని, బ‌స్టాండ్ల‌లో మౌలిక స‌దుపాయాలు క‌ల్పించాల‌ని, ప్ర‌మాదాల‌ను నివారించాలి, ఆర్టీసీ ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని వారు కోరారు. ఎండీని క‌లిసిన వారిలో ఎమ్మెల్యేలు ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి, అంజ‌ద్‌బాషా, విశ్వేశ్వ‌ర్‌రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియ‌న్ రాష్ట్ర అధ్య‌క్షుడు గౌతంరెడ్డి ఉన్నారు.

Back to Top