ఆదినారాయణ రెడ్డిని బర్తరఫ్‌ చేయాలి

ఏయూక్యాంపస్‌(విశాఖతూర్పు): దళితులను అవమానపరచే విధంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆదినారాయణ రెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని వైయస్‌ఆర్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. శుక్రవారం ఉదయం ఏయూ అంబేద్కర్‌ విగ్రహం వద్ద విద్యార్థులతో కలసి నిరసన తెలిపారు. మంత్రి కుల దురహంకారానికి వ్యాఖ్యలు అద్దంపడుతున్నాయన్నారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్‌ను అపహాస్యం చేసే విధంగా మంత్రి వ్యాఖ్యానించారన్నారు. సమాజంలో వివక్షతను పెంచే విధంగా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని, ఇటువంటి వ్యక్తులు మంత్రులుగా కొనసాగే అర్హతను కోల్పోయారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు దళితుల పట్ట ప్రేమ ఉంటే వెంటనే ఆదినారాయణ రెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించి, రాష్ట్రంలోని దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పించాలన్నారు.

ప్రభుత్వం మంత్రి వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి వెంటనే కేసును నమోదు చేయాలన్నారు. గవర్నర్‌ జోక్యం చేసుకుని ఆదినారాయణ రెడ్డి శాసన సభ్యత్వాన్ని రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.కాంతారావు, రాష్ట్ర కార్యదర్శులు బి.మోహన్‌ బాబు, టి.సురేష్‌ కుమార్, యం.సురేష్‌ కుమార్, విద్యార్థి నాయకులు కుమార స్వామి, జి.నాని, ఈశ్వర్, మధు, రాధా, శంకర్, గౌరీ శంకర్, సూర్య, మధు, కోటి, రాజశేఖర్, శ్యామ్‌సుందర్‌. మర్రివేముల శ్రీనివాస్‌ తదితరులు పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Back to Top